కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా

Jun 11 2026 7:59 AM | Updated on Jun 11 2026 7:59 AM

రాయచూరు రూరల్‌: కలబుర్గి డివిజన్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. బుధవారం కలబుర్గి డివిజన్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవ ప్రభు మాట్లాడారు. విశ్వ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 281 మందిని పర్మినెంట్‌ చేయడానికి రాష్ట్ర సర్కార్‌ ముందుకు రావాలన్నారు. 45 రోజులుగా ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడంతో కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొంత మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలను పెంచి ఆదుకోవాలని కోరుతూ వైస్‌ చాన్సలర్‌ రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement