కరీంనగర్ కార్పొరేషన్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరిట ఓటు చోరీ కాకుండా బీఎల్‌ఏ లు అడ్డుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆది వారం నగరంలోని సీతారాంపూర్ పీఎం కన్వెన్షన్‌లో జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి బీఎల్‌ఏ 2 శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, లౌకికవాద ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కుట్ర లకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీ లించాలన్నారు. ఇన్‌చార్జీ నమిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో బూత్‌స్థాయి నాయకులు, ఏజెంట్లు, కార్యకర్తలు పాల్గొని ప్రతి ఓటును రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై ద్యుల అంజన్‌కుమార్, లైబ్రరీ చైర్మన్ సత్తు మ ల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: పద్మశాలీలు అన్ని రంగాల్లో రా ణించాలని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, తెలంగాణ హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ చైర్మన్ దూడం వెంకటరమణ సూచించారు. కరీంనగర్‌లోని పద్మశాలి కల్యాణ మండపంలో జిల్లా పోపా ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, ఉద్యోగులకు పద్మరత్న పురస్కారాలు ప్రదానం చేశా రు. కార్యక్రమానికి పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. గూ డూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో పోపా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పద్మశాలీల కార్పొరేషన్, టెక్స్‌టైల్ ద్వారా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ దంపతులను మెమొంటోతో సత్కరించారు. సీనియర్ జర్నలిస్ట్‌లు కొండ లక్ష్మణ్, మార్త ప్రకాశ్‌ను పద్మరత్న పురస్కారా లతో సత్కరించారు. పోపా ప్రధాన కార్యదర్శి ఎలిగేటి మల్లికార్జున్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, పోలీసుల సంక్షేమ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మామిడాల సురేందర్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేశ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని కమాన్‌చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక డిక్లరేషన్లు ప్రకటించి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో పెట్టుబడిసాయం ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. జూన్‌లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం చేశారన్నారు. నాయకులు సుంకర సంపత్, ఎడ్ల రమేశ్, డి.నరేశ్, కొప్పుల శంకర్, గజ్జల శ్రీకాంత్, అరవింద్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, గుండేటి వాసుదేవ్, సీహెచ్ రా ములు, చక్రపాణి, అరవింద్, రాజ్ కుమార్, శివ, వి.కిషోర్, రాజకుమారి పాల్గొన్నారు.


