సండే అని.. ఆలస్యంగా తెరిచారు
చొప్పదండి: మండలంలోని గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆదివారం ఆలస్యంగా తెరిచారు. ఉదయం పది గంటల వరకు సిబ్బంది, డాక్టర్లు ఎవరూ రాలేదు. గేటు మూసి వేసి ఉండగా, ఆస్పత్రి భవనం తాళాలు తీయలేదు. రోగులు ఆసుపత్రి ఆవరణలో కనిపించలేదు. ఈ విషయమై పీహెచ్‌సీకి చెందిన వైద్యురాలు అరుణ మాట్లాడుతూ గ్రామానికి దూరంగా ఉండటంతో బస్సులు, ఆటోల ద్వారా ఆస్పత్రికి చేరుకొనేందుకు సిబ్బందికి ఆలస్యమైందని తెలిపారు. ప్రతి రోజు ఈ సమస్య లేదని, ఆదివారం కావడంతో ఆలస్యంగా చేరకున్నారని తెలిపారు.


