పాఠ్యపుస్తకాలొచ్చాయ్‌ | - | Sakshi
Sakshi News home page

పాఠ్యపుస్తకాలొచ్చాయ్‌

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

కరీంనగర్‌ టౌన్‌: కొత్త విద్యా సంవత్సరంలో నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పుస్తకాలు జిల్లా కు చేరుకున్నాయి. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వరుస నంబర్లతో పాటు క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. ఇవి మార్కెట్‌లో కనిపిస్తే సులువుగా పట్టుకునే వీలుంటుంది. ఈ ఏడాది పాఠ్యపుస్తకాలపై ఎలాంటి సమస్య ఉన్నా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని ముద్రించారు. బాలికలను వేధించినా, బాల్య వివాహాలు చేసి, బాలలను పనిలో పెట్టుకున్నా చైల్డ్‌లైన్‌ నంబర్‌ 1098కు ఫోన్‌ చేయాలని ముద్రించారు. గోడౌన్‌ నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ కార్యాలయాలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలో పార్ట్‌–1 పుస్తకాలు అందించనున్నారు. ఎస్‌ఏ–1 పరీక్షలు పూర్తయ్యాక సెప్టెంబరు, అక్టోబర్‌లో పార్ట్‌– 2 పుస్తకాలు అందజేయనున్నారు.

జిల్లాకు పుస్తకాలు రాక

జిల్లాకు 3,07,990 పుస్తకాలు అవసరం ఉంది. 100శాతం పుస్తకాలు జిల్లాకు చేరాయి. గతేడాది మాదిరిగానే బార్‌కోడింగ్‌ పుస్తకాన్ని అందించనున్నారు. కోడ్‌ నంబర్‌ ప్రకారం హైదరాబాద్‌లోని ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ఏఏ జిల్లాలకు ఏయే నంబర్లు చేరాయో పక్కగా లెక్కల్లో తెలిసిపోతుంది. పుస్తకంపై ముద్రించిన వరుస సంఖ్యను బట్టి చూస్తే ఏ విద్యార్థికి చేరిందో రికార్డుల్లో ఉంటాయి.

నేరుగా నోట్‌బుక్స్‌ పాఠశాలలకే

విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా రెండేళ్ల నుంచి నోట్‌బుక్స్‌ విద్యాశాఖ పంపిణీ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇది వరకు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల నుంచి ఇంటర్‌ వరకు చదివే వారికి ఉచితంగా రాత పుస్తకాలు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమికస్థాయి వారికి సైతం ఇవ్వనున్నారు. నోట్‌బుక్స్‌ సైతం ఇది వరకు జిల్లా గోడౌన్‌కే చేరేవి. ఈసారి నుంచి నేరుగా ముద్రణ కేంద్రం నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా పాఠశాలలకు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement