క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యం

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

సామర్లకోట: క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యమని రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌ అన్నారు. శుక్రవారం పెద్దాపురం శ్రీప్రకాష్‌ సినర్జీ స్కూల్‌లో రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 230 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో బాల బాలికలకు ఈ పోటీలు జరుగుతున్నాయని విజయ్‌కుమార్‌ చెప్పారు. క్రీడా కారులకు అన్ని సదుపాయాలను పాఠశాల నుంచి కల్పిస్తున్నామన్నారు. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీసు (ఐఆర్‌టీఎస్‌) అధికారి డాక్టర్‌ చిలుకా ప్రదీప్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు ఎప్పటికప్పుడు వారి ఆట తీరును మెరుగుపరుచుకోవాలన్నారు. టెబుల్‌ టెన్నీస్‌పై రోజు రోజుకూ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని రాష్ట్ర టెబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.విశ్వనాథ్‌ తదితరులు అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement