"సిగ్గులేని అబద్ధాల కోరులు".. ట్రంప్ దంపతులపై ట్రోల్స్‌ | shameless liars trump and melania fire after iran war remarks | Sakshi
Sakshi News home page

"సిగ్గులేని అబద్ధాల కోరులు".. ట్రంప్ దంపతులపై ట్రోల్స్‌

Apr 7 2026 9:10 PM | Updated on Apr 7 2026 9:16 PM

shameless liars trump and melania  fire after iran war remarks

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలపై సోషల్‌ మీడియాలో విపరీతమైన నెగిటివ్‌ ట్రోల్స్‌ నడుస్తున్నాయి. ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో మెలానియా చేసిన వాఖ్యలు పెద్దఎత్తున దుమారం రేపుతున్నాయి. అమెరికా దాడుల్లో వందలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే.. వారి భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తామనడం ఏవిధంగా సమంజనీయసమని నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు.

నిన్న ఆదివారం వైట్ హౌస్‌లో జరిగిన  'ఈస్టర్ ఎగ్ రోల్' కార్యక్రమంలో ట్రంప్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెలానియా మాట్లాడుతూ' ఇరాన్‌లో జరుగుతున్న సంఘర్షణ అంతా అక్కడి పిల్లల భవిష్యత్తు కోసమే వారు సురక్షితంగా ఉండాలనే తాము పోరాడుతున్నాం' అన్నారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ "మేము యుద్ధ ప్రాంతంలో ఉన్న పిల్లల కోసం, వారి తల్లిదండ్రుల కోసం పోరాడుతున్నాం. వారి భవిష్యత్తును కాపాడటమే మా లక్ష్యం" అని  వ్యాఖ్యానించారు.

అయితే  ఈ వ్యాఖ్యలకు గానూ ట్రంప్‌ దంపతులపై.. ప్రజలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ యుద్ధంలో అమెరికా  జరిపిన దాడుల్లో వందలాది మంది ఇరాన్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అలాంటిది వారి క్షేమం కోసమే యుద్ధం అనడం  అని మాట్లాడటం సిగ్గులేని తనమని కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా యుద్ధం మెుదలైన తొలిరోజే ఒక పాఠశాల పై జరిగిన దాడిలో190 మందికి పైగా విద్యార్థినిలు చనిపోయారు. అంతేకాకుండా ఇంతకాలంహగా జరుగుతున్న యుద్ధంలో పెద్దఎత్తున పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పిల్లల కోసమే యుద్ధం అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అదేవిధంగా ఇరాన్‌లోని మౌళిక సదుపాయాలు  మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని హెచ్చరిస్తూన్న ట్రంప్ ఏ విధంగా ఆ దేశపిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement