యుద్ధం.. అమెరికాకు ఎన్ని లక్షల కోట్లు నష్టమంటే? | cost of iran war pentagon officials admits 25 billion burden | Sakshi
Sakshi News home page

యుద్ధం.. అమెరికాకు ఎన్ని లక్షల కోట్లు నష్టమంటే?

Apr 29 2026 10:08 PM | Updated on Apr 29 2026 10:08 PM

 cost of iran war pentagon officials admits 25 billion burden

అమెరికా- ఇరాన్‌ యుద్ధం వల్ల కలిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్దం కారణంగా సూమారుగా రూ. 25 లక్షల కోట్లకు పైగా నష్టపోయామని దానికి ఎట్టిపరిస్థితుల్లో పరిహారం చెల్లించాల్సిందేనని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తూ వచ్చింది. కాగా తాజాగా అమెరికా సైతం యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అంచనా వేసింది.

ఇప్పటివరకు సుమారు $25 బిలియన్ల (సుమారు రూ. 2.1 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ బడ్జెట్ చీఫ్ బుధవారం వెల్లడించారు. ఇరాన్‌పై దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న హైటెక్ క్షిపణులు, బాంబుల నిల్వలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలైన మొదటి రెండు రోజుల్లోనే $5.6 బిలియన్ల విలువైన ఆయుధాలు వాడినట్లు సమాచారం.ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అత్యంత సమగ్రమైన అంచనా ఇది.

ఈ మేరకు రక్షణ బడ్జెట్‌పై జరిగిన కీలక సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ పాల్గొన్నారు. రక్షణ బడ్జెట్‌ను 40% పెంచడం వల్ల గతంలో జరిగిన తక్కువ పెట్టుబడుల లోటు తీరుతుందని ఈ సమావేశంలో హెగ్సెత్ అన్నారు.. యుద్ధం విషయంలో ప్రతిపక్ష డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్ల మాటలు "ఓటమిని కోరుకునేవిగా" ఉన్నాయని  విమర్శించారు. ఇదే సమయంలో చైనాతో "ఆధిపత్యం" కోసం కాకుండా, ఒక "సమతుల్య సంబంధం" కోసం అమెరికా ప్రయత్నిస్తుందని హెగ్సెత్ పునరుద్ఘాటించారు.

ఈ యుద్ధంలో అమెరికాకు సహకరించని మిత్రదేశాలు (ముఖ్యంగా నాటో) తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెగ్సెత్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలు అమెరికాకు ఆదర్శవంతమైన మిత్రదేశాలుగా ఆయన ప్రశంసించారు.కాగా ప్రస్తుతం యుద్ధంలో ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement