నీటి కోసం రెండు కుటుంబాల యుద్ధం  | Clashes over water resources in Chad kill over 40 people | Sakshi
Sakshi News home page

నీటి కోసం రెండు కుటుంబాల యుద్ధం 

Apr 28 2026 5:28 AM | Updated on Apr 28 2026 7:45 AM

Clashes over water resources in Chad kill over 40 people

చాద్‌: భవిష్యత్తులో నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని విన్నాం. కానీ, ఆఫ్రికా దేశమైన చాద్‌లో రెండు కుటుంబాల మధ్య యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో కనీసం 42 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 10 మంది గాయపడ్డారని తెలియజేసింది. 

పొరుగు దేశం సూడాన్‌ నుంచి లక్షలాది మంది శరణార్థులు తూర్పు చాద్‌కు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో వనరుల కొరత తీవ్రంగా ఉంది. మంచినీరు దొరకడం కూడా గగనంగా మారింది. సూడాన్‌ సరిహద్దులో వాది ఫిరా ప్రావిన్స్‌లోని ఇగోట్‌ గ్రామంలో శనివారం తాగునీరు పట్టుకొనే విషయంలో రెండు కుటంబాల మధ్య గొడవ మొదలైంది. 

అది క్రమంగా తీవ్ర ఘర్షణగా మారింది. రెండు కుటుంబాలకు చెందినవారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. చేతికందిన వస్తువులతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. రక్తం ఏరులై పారింది. 42 మంది ప్రాణాలు కోల్పోయారు. చాద్‌లో వనరుల కోసం ఇలాంటి ఘర్షణలు సర్వసాధారణంగా మారిపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement