నిందితుడు బెస్ట్‌ టీచర్‌!  | Accused is a software developer and teacher | Sakshi
Sakshi News home page

నిందితుడు బెస్ట్‌ టీచర్‌! 

Apr 27 2026 4:25 AM | Updated on Apr 27 2026 8:51 AM

Accused is a software developer and teacher

ట్యూటర్, సాఫ్ట్‌వేర్, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌

వాషింగ్టన్‌: హిల్టన్‌ హోటల్లో కాల్పులకు తెగబడ్డ అలెన్‌ విద్యాధికుడు. ట్యూటర్‌గా, సాఫ్ట్‌వేర్, గేమింగ్‌ డెవలపర్‌గా పని చేసినట్లు దర్యాప్తులో తేలింది. రెండేళ్ల క్రితం ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం అందుకున్నాడు. 2017లో పాసడీనాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అలెన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేశాడు. అప్పుడు క్రిస్టియన్‌ స్టూడెంట్‌ ఫెలోషిప్‌ సైతం సాధించాడు. అదే ఏడాదిలో యూనివర్సిటీలో కాలేజీ విద్యార్థులు సరదాగా బొమ్మ తుపాకులతో నిర్వహించే క్రీడల్లో ‘నెర్ఫ్‌ గన్స్‌’ విద్యార్థుల జట్టులో అలెన్‌ సభ్యునిగా ఉన్నాడు. 

2025లో డోమిన్‌గేజ్‌ హిల్స్‌లోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో అలెన్‌ మాస్టర్‌ డిగ్రీ పూర్తిచేశాడు. మెకానికల్‌ ఇంజనీర్‌గా, టీచింగ్‌ అసిస్టెంట్‌గా చేశాడు. ‘నాసా’ జెట్‌ ప్రొపల్షన్‌ లేబోరేటరీలో రీసెర్చ్‌ ఫెలోషిప్‌లో పాలుపంచుకున్నాడు. కాలేజీలో చేరాలనుకునే ఆరేళ్లుగా పార్ట్‌టైమ్‌ టీచర్‌గా చేస్తున్నాడు. బొహర్‌డ్యామ్, ఫస్ట్‌ లా అనే వీడియోగేమ్‌లను అభివృద్ధిచేశాడు. అలెన్‌ అరెస్టు అనంతరం ఆన్‌లైన్‌లో ఈ గేమ్‌లను వెతికేవారి సంఖ్య భారీగా పెరిగింది!

హారిస్‌కు విరాళం: అలెన్‌ డెమొక్రటిక్‌ పార్టీ సానుభూతిపరుడని తెలుస్తోంది. 2024లో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు 25 డాలర్లు విరాళం ఇచ్చినట్టు వెల్లడైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement