– 8లో
కొంపముంచిన మద్యం మత్తు!
మద్యం మత్తు నలుగురిని తీవ్ర గాయాలపాలు చేసింది. కారు బస్సు కిందకు దూసుకెళ్లడంతో నలుగురు గాయపడ్డారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగంతో భూముల సారవంతం తగ్గిపోతోందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీ, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్త ఎ.రామకృష్ణారావు తెలిపారు. రైతులు జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వారు బుధవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ భూసారాన్ని పరిరక్షించేందుకు అజోస్పిరిల్లం, జటోబాక్టర్, రైజోబియం, పీఎస్‌బీ, కేఎస్‌బీ వంటి జీవన ఎరువులతో పాటు జనుము, జీలుగ, పిల్లిపీసర, అలసంద వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని సూచించారు. భూసార ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా జీవసంబంధిత పురుగు మందులను వాడాలన్నారు. పొలాల్లో పసుపు, నీలి రంగు జిగురు అట్టలు, లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉధృతిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వివరించారు. రైతులు వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యానవన పంటలు, సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఖరీఫ్–2026 సీజన్‌కు జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు సుమారు 500 రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమో, ఐటీఐ, డిగ్రీ, డిఫార్మసీ, బీఫార్మసీ, ఎమ్ ఫార్మసీ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారు హాజరుకావొచ్చని పేర్కొన్నారు.


