బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారీగా పెరిగిన సిల్వర్ రేటు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు మరోమారు వెండి ధరలు పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు వెండి రేటు రూ.10,000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలకు చేరింది. ఈ ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. అయితే ఢిల్లీలో మాత్రం వెండి రేటు రూ.5000 తగ్గింది. కాబట్టి.. ఇక్కడ సిల్వర్ రేటు రూ.2.50 లక్షలకు చేరింది.
వెండి ధరలు పెరగడానికి కారణాలు
మార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.
పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.
అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.
వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.
ఇదీ చదవండి: పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం


