పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం | PIB Fact Check About Petrol Diesel Price Hikes, Says No ₹10–₹12.50 Hike And Rates Remain Unchanged | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Apr 30 2026 2:58 PM | Updated on Apr 30 2026 4:02 PM

PIB Fact Check About Petrol Diesel Price Hikes

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.10, రూ.12.50 పెరిగినట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పదించింది.

పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ''ఇంధన ధరల పెంపునకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఉత్తర్వు నకిలీది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వు ఏదీ జారీ చేయలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 'X' లోని ఒక పోస్ట్‌లో పేర్కొంది.

పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఉన్న సమయంలో.. ఫ్యూయెల్ ధరల పెరుగుదల వార్త, ప్రజల్లో ఆందోళన కలిగించింది. అంతే కాకుండా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జరుగుతున్న సమయంలో.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నిజమే అని చాలామంది భావించారు. అయితే ధరల పెరుగుదల నిజం కాదని, పీఐబీ అధికారికంగా వెల్లడించింది.

కాగా.. మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉంటాయని తెలిపారు. నిత్యావసర ఇంధనాలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, ఆమె వినియోగదారులకు హామీ ఇచ్చారు. ఎల్‌పీజీ, పెట్రోలియం, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి, ధరలు కూడా పెరగలేదు. కాబట్టి దయచేసి ఆందోళన చెందవద్దని శర్మ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement