సెయిల్‌ చైర్మన్‌ రాజీనామా | SAIL Chairman Amarendu Prakash Has Resigned | Sakshi
Sakshi News home page

సెయిల్‌ చైర్మన్‌ రాజీనామా

Apr 3 2026 5:43 PM | Updated on Apr 3 2026 5:53 PM

SAIL Chairman Amarendu Prakash Has Resigned

ప్రభుత్వరంగ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) చైర్మన్, ఎండీ అయిన అమరేందు ప్రకాష్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్‌ 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిన సెయిల్‌ సమాచారం ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ కుమార్‌సింగ్‌కు చైర్మన్, ఎండీగా తాత్కాలిక బాధ్యతలను అప్పగించినట్టు.. ఏప్రిల్‌ 2 నుంచి జూలై 1 వరకు లేదా రెగ్యులర్‌ నియామకం జరిగే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపింది.

అమరేందు ప్రకాష్‌ తన రాజీనామాకు సంబంధించి నోటీసును జనవరి 2న ఉక్కు శాఖకు సమర్పించారు. అధికారిక అమోదం రావడంతో ఏప్రిల్‌ 1తో సెయిల్‌ బోర్డు నుంచి వైదొలగినట్టు సెయిల్‌ ప్రకటించింది. మరోవైపు సెయిల్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఉన్న అశోక్‌ కుమార్‌పాండాను చైర్మన్, ఎండీ పదవికి ప్రభుత్వరంగ సంస్థల నియామక బోర్డు సిఫారసు చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement