కరోనా: రిలయన్స్‌ మరో సంచలన నిర్ణయం

Mukesh Ambani Relianceworking on cheaper COVID-19 drug, affordable test kits - Sakshi

చౌక ధరలో కరోనా ఔషధం

సరసమైన ధరలో టెస్టింగ్‌  కిట్స్‌

సాక్షి, ముంబై: కరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ ముందుకు వచ్చారు.  కరోనా చికిత్సలో కొత్త ఔషధాన్ని లాంచ్‌ చేసే ప్రయత్నల్లో రిలయన్స్‌ బిజీగా ఉంది. అలాగే చౌక కరోనా టెస్టింగ్‌ కిట్‌ను కూడా లాంచ్‌ చేయనుంది. కోవిడ్‌-19కు నివారణగా నిక్లోసామైడ్ (టేప్‌వార్మ్ డ్రగ్‌) ఔషధాన్ని రియలన్స్‌ ముందుకు తీసుకు రానుంది. రిలయన్స్‌ తయారు చేసిన డయాగ్నొస్టిక్ కిట్లు - ఆర్-గ్రీన్, ఆర్-గ్రీన్ ప్రో లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుండి అనుమతి లభించింది.

అంతేకాదు మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ ధరకే శానిటైజర్లను తయారుచేసే ప్రణాళికను కూడా రూపొందించింది. ఖరీదైన టెస్టింగ్‌ కిట్స్‌, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు  చేస్తున్న లక్షల కొద్దీ బిల్లులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు  రిలయన్స్‌ ప్రయత్నాలు మంచి ఊరటనివ్వనున్నాయని  ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ ఆసుపత్రులను వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి మరింత కృషి చేస్తోంది. ఇందుకుగాను రిఫైనింగ్-టు-రిటైల్ గ్రూప్ 3డీ టెక్నాలజీ "స్పెషల్ స్నార్కెలింగ్ మాస్క్" వినియోగిస్తోందని బ్లూం బర్గ్‌ నివేదించింది. నిమిషానికి 5-7 లీటర్ల సామర్థ్యం కలిగిన గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేస్తోందట.

కాగా కరోనాపై పోరులో భాగంగా 2020 లో రిలయన్స్ ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను తయారు చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్  సీఎం రిలీఫ్ఫం డ్‌కు కోటి  రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో   875 పడకలను అందించింది. సెకండ్‌ వేవ్‌లో దేశవ్యాప్తంగా మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాకు రిలయన్స్ చురుకుగా సహాయం చేస్తోంది.

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి  కరోనా బాధితులకు ఉచిత చికిత్స అందించేలా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 225 పడకల సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలో  దేశంలోని మొత్తం మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిలో రిలయన్స్ 11 శాతం ఉత్పత్తి చేస్తుంది. ఏప్రిల్‌లో 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేసింది. సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్‌ , జర్మనీ నుంచి 24 ఐఎస్‌వో కంటైనర్లను  విమానంలో  రప్పించిన సంగతి తెలిసిందే.  

చదవండి : vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు
Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

03-06-2021
Jun 03, 2021, 17:46 IST
ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ వ్యాక్సిన్ల విషయంలో రాజస్తాన్‌, పంజాబ్‌ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును గురువారం ట్విటర్‌లో...
03-06-2021
Jun 03, 2021, 16:55 IST
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం చేపట్టారు....
03-06-2021
Jun 03, 2021, 16:48 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,25,682...
03-06-2021
Jun 03, 2021, 16:44 IST
ముంబై(బుల్దానా): కరోనా పేషంట్లకు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను 8 ఏ‍ళ్ల చిన్నారితో కడిగించిన అవమానీయ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి...
03-06-2021
Jun 03, 2021, 14:55 IST
లక్నో: కోవిడ్‌ వ్యాక్సిన్‌ బృందాన్ని చూసిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ టీకాకు భమపడి డ్రమ్‌ వెనుక దాక్కుంది....
03-06-2021
Jun 03, 2021, 12:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్​ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం తీసుకున్న...
03-06-2021
Jun 03, 2021, 10:52 IST
ఇండియాలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలాక శ్వాస సమస్యలు.. ...
03-06-2021
Jun 03, 2021, 10:14 IST
మైసూరు: ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర తాలూకా హెచ్‌.మూకహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది....
03-06-2021
Jun 03, 2021, 08:18 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల 2020లో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. చాలామంది నగరాలు, పట్టణాల నుంచి...
03-06-2021
Jun 03, 2021, 06:15 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19పై అత్యధిక సామర్థ్యంతో పని చేస్తున్న ఫైజర్, మోడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు భారత్‌కు రావడానికి గల అడ్డంకులన్నీ...
03-06-2021
Jun 03, 2021, 05:33 IST
జగ్గయ్యపేట అర్బన్‌/లబ్బీపేట (విజయ వాడ తూర్పు): చనిపోయిందనుకున్న మనిషి కళ్లెదుట నిక్షేపంలా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. సరిగ్గా ఇలాంటి...
03-06-2021
Jun 03, 2021, 05:27 IST
జెనీవా: భారత్‌లో మొట్టమొదటిసారిగా బయటపడిన బి.1.617 కోవిడ్‌–19 వేరియెంట్‌లో ఒక రకం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ...
03-06-2021
Jun 03, 2021, 04:37 IST
సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్ల పైన వయసు ఉన్న వారికే టీకా వేస్తున్నామని, అయితే ఉద్యోగాలు లేదా...
02-06-2021
Jun 02, 2021, 22:01 IST
సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2384 కేసులు నమోదు కాగా.. 17 మరణాలు...
02-06-2021
Jun 02, 2021, 19:13 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు స్టైఫండ్‌ను రూ. 45 వేల నుంచి 75 వేలకు పెంచాలని రాష్ట్ర...
02-06-2021
Jun 02, 2021, 18:29 IST
ముంబై: కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మహారాష్ట్ర ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న తరహాలో విభిన్న...
02-06-2021
Jun 02, 2021, 17:53 IST
ఢిల్లీ: కోవిడ్‌-19 వ్యాక్సిన్ల కొనుగోళ్లపై బుధవారం సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు...
02-06-2021
Jun 02, 2021, 16:55 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 98,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,768 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,14,261...
02-06-2021
Jun 02, 2021, 15:49 IST
కరోనా మహమ్మారి మా జీవితాలను మార్చేసింది. మన అనుకున్నవాళ్లు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసింది.
02-06-2021
Jun 02, 2021, 13:17 IST
బీజింగ్‌/జెనీవా: చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్‌ తయారుచేసిన సినోవాక్‌ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top