రికార్డ్‌ సేల్స్‌: పది లక్షల ఏసీలు అమ్మేశాం.. | LG Electronics India sold over 10 lakh AC units in Q1 2026 | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ సేల్స్‌: పది లక్షల ఏసీలు అమ్మేశాం..

Apr 5 2026 11:18 AM | Updated on Apr 5 2026 1:19 PM

LG Electronics India sold over 10 lakh AC units in Q1 2026

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2026) తొలి త్రైమాసికం (జనవరి–మార్చి)లో పది లక్షలకు పైగా ఎయిర్‌ కండీషనర్ల విక్రయాల మార్కును అధిగమించినట్లు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా తెలిపింది. తద్వారా కేటగిరీలో ’నిర్ణయాత్మక లీడరు’గా నిల్చినట్లు వెల్లడించింది.

సీజన్‌ ప్రారంభానికి ముందే కొత్త బీఈఈ స్టార్‌ రేటింగ్‌ ఏసీలను ప్రవేశపెట్టడం, అలాగే ఐసీసీ వరల్డ్‌ కప్‌ సందర్భంగా నిర్వహించిన మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ మొదలైనవి ఇందుకు తోడ్పడినట్లు కంపెనీ వివరించింది.

అయితే, కేటగిరీ లీడరుగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ క్లెయిమ్‌ చేసుకోవడాన్ని టాటా గ్రూప్‌ సంస్థ వోల్టాస్‌ తోసిపుచ్చింది. ఏటా సుమారు 1.2–1.4 కోట్ల యూనిట్ల స్థాయిలో ఉండే రెసిడెన్షియల్‌ ఎయిర్‌ కండిషన్‌ మార్కెట్లో తామే అగ్రగాములమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement