జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
పర్చూరు(చినగంజాం): మనం ఆరోగ్యం ఉండాలంటే ప్రతి ఒక్కరికి యోగా తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ వినోద్‌కుమార్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి, ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం పర్చూరులోని అద్దంకి నాంచారమ్మ కల్యాణ మండపంలో నిర్వహించి యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు భవిష్యత్‌లో రాకూడదనుకుంటే యోగా చేయాలని, వ్యాధులు దరి చేరకుండా అరోగ్యాన్ని కాపాడే శక్తి యోగాకు ఉందనిన్నారు. అనంతరం ఆయన డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పలు ఆసనాలు, ప్రాణామాయం వంటి పలు అంశాలను స్థానిక అధికారులు, ప్రభుత్వ సిబ్బందితో కలిసి స్వయంగా వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో తహసీల్దార్ పీ బ్రహ్మయ్యతోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


