దుర్గమ్మకు విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు విరాళాలు

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కడప చిన్న చౌక్‌కు చెందిన కె.గోపిరెడ్డి కుటుంబం అయ్య వరమ్మ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడుకు చెందిన వై.కనకదుర్గ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement