ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత ఉర్దూ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత ఉర్దూ శిక్షణ

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత ఉర్దూ శిక్షణ గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియెట్‌లో చేరిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా ఉర్దూ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఉర్దూ ప్రత్యేకాధికారి షేక్‌ నాగూర్‌వలీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్‌ ఇంటర్‌లో చేరి, ఉర్దూను ద్వితీయ భాషగా ఎంపిక చేసుకున్న విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరు కావచ్చునని తెలిపారు. ఉర్దూ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఉర్దూ భాషను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విద్య, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్‌స్థాయిలో ఉర్దూను చదవడం ద్వారా విద్యార్థులు తమ మాతృభాషను పరిరక్షించుకోవడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో ముందుకు వెళ్లగలరని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన ఉంటుందని, ఉర్దూ భాషలో ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులకు విద్యార్థులు ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. కోచింగ్‌ ఆన్‌లైన్‌ ద్వారా, ఎక్కడి నుండైనా పాల్గొనవచ్చు. వివరాలకు 98851 39827 నంబర్లో సంప్రదించాలని సూచించారు. లైంగిక వేధింపులపై కేసు నమోదు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు సగటు వర్షపాతం 4.2 మిల్లీమీటర్లు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. సగటున 4.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా మేడికొండూరు మండలంలో 38.6 మి.మీ వర్షం పడగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 1 మి.మీ వర్షం పడింది. ఫిరంగిపురం మండలంలో 22.4 మి.మీ., పెదకాకాని 5.8, తుళ్లూరు 2.8, ప్రత్తిపాడు 1.8, గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది.

పెదకాకాని: విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేయడంపై కేసు నమోదు చేసినట్లు పెదకాకాని పోలీసులు శనివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఒక విద్యార్థిని గుంటూరు నగర శివారులోని ప్రైవేట్‌ కళాశాలలో డెంటల్‌ కోర్స్‌ చదువుతుంది. ఆ విద్యార్థిని విశాఖపట్నంలో ఉన్న సమయంలో సోషల్‌ మీడియా ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ యువకుడు ప్రేమిస్తున్నానని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. తన నెంబర్‌ బ్లాక్‌ చేయగా తన స్నేహితుల ద్వారా ఫోన్‌ చేసి యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు.

పురపాలక శాఖ మంత్రి నారాయణ

తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement