మార్టూరు: ఉపాధి కోసం వచ్చి మార్టూరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన వివరాలు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం గ్రామానికి చెందిన దాసరి అశోక్ కుమార్(46) వెల్డింగ్ పనుల నిమిత్తం మార్టూరు వచ్చాడు. స్థానిక మద్ది సీతాదేవి కాలనీ సమీపంలో ఓ ఇంటి వద్ద పనిచేస్తున్న అశోక్ కుమార్ తాను పట్టుకున్న ఇనుప నిచ్చెన విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతడిని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు అశోక్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన అశోక్ కుమార్ హఠాన్మరణం విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతికి గల కారణాలు తెలుసుకొని అశోక్ కుమార్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉప్పలపాటి అనిల్చౌదరి, గర్నె పూడి రవిచంద్, అట్లూరి సుకుందరావు, మైలా చిన్న నాగేశ్వరరావు, గొట్టిపాటి ఆనంద్, మోషే నాయక్, అట్లూరి జైపాల్, అట్లూరి వెంకయ్య, పేరం దానియేలు తదితరులు ఉన్నారు.
నివాళులర్పించిన జిల్లా వైఎస్సార్ సీపీ
అధ్యక్షుడు నాగార్జున


