తుమృకోట కేసులో నలుగురికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

తుమృకోట కేసులో నలుగురికి రిమాండ్‌

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

రెంటచింతల: మండలంలోని తుమృకోట గ్రామంలో ఈ నెల 9వ తేదీ మంగళవారం రాత్రి ఇంటిపై నిద్రిస్తున్న ఆలేటి కోటేశ్వరరావుపై కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచిన కేసుకు సంబంధించి 4 గ్గురిని గురజాల కోర్టులో హాజరుపెట్టగా వారికి జడ్జి ఆలేఖ్య రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున శుక్రవారం తెలిపారు. కేసులో మొత్తం 11 మంది నిందితులు కాగా వారిలో ఆలేటి శిలువరాజు, ఆలేటి చిన లక్ష్మయ్య, ఆలేటి సత్యం, ఆలేటి దానంను హాజరుపెట్టడం జరిగిందన్నారు.

పల్టీలు కొట్టిన కారు

ఇరువురికి గాయాలు

యడ్లపాడు: అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై యడ్లపాడు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నంద్యాలకు చెందిన కిరణ్‌ తన స్నేహితుడితో కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వైపు కారులో వెళ్తున్నారు. యడ్లపాడు వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీకొట్టింది. కిరణ్‌, అతని స్నేహితుడికి గాయాలుకాగా, కారు ధ్వంసమైంది. స్థానికులు క్షతగాత్రులను కారు నుండి బయటకు తీశారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement