డబ్బులు చెల్లించినా బంగారు ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

డబ్బులు చెల్లించినా బంగారు ఇవ్వలేదు

Jun 13 2026 7:44 AM | Updated on Jun 13 2026 7:44 AM

– కెనరా బ్యాంకు ముందు మహిళ బైఠాయింపు

పీలేరు రూరల్‌ : బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి డబ్బులు చెల్లించినా తనకు బంగారు ఇవ్వలేదని స్థానిక కెనరా బ్యాంకు ముందు మహిళ బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. వివరాలిలా వున్నాయి. మండలంలోని కావలిపల్లె పంచాయతీ మద్దిపట్లవాండ్లపల్లెకు చెందిన శివమ్మ అనే మహిళ ఏడాది క్రితం స్థానిక కెనరా బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుంది. శుక్రవారం తన బంగారు విడిపించుకోవడానికి డబ్బులు చెల్లించింది. అయితే బంగారు తిరిగి ఇవ్వడానికి కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రిహానా నిరాకరించింది. దీంతో బాధితురాలు బ్యాంకు వద్ద బైఠాయించి తన బంగారు ఇచ్చేంత వరకు తిరిగి వెళ్లేది లేదని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు, బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి ధర్నా విరమింపచేశారు. ఈ విషయంపై కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రిహానాను వివరణ కోరగా శివమ్మ ఐదేళ్ల క్రితం వారి గ్రామానికి ఓ మహిళ ఆవు లోను షూరిటీ ఉందని, ఆ లోను క్లియర్‌ కానుందున నగలు ఇవ్వలేదని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement