మాజీ సీఎం జగన్‌తో పిన్నెల్లి భేటీ | Pinnelli Ramakrishna Reddy Meets YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం జగన్‌తో పిన్నెల్లి భేటీ

Mar 25 2026 5:55 AM | Updated on Mar 25 2026 8:11 AM

Pinnelli Ramakrishna Reddy Meets YS Jagan Mohan Reddy

సాక్షి, అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఆయన ఇటీవల బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తనపైన, తన సోదరుడిపైన టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా జగన్‌కు వివరించారు. 

తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్‌ జగన్‌ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్‌ అభయమిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పిన్నెల్లి కుమారుడు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement