ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్‌ ట్రెండ్‌ సెట్టర్స్‌

NTR YSR YS Jagan Are Trend Setters Says MLA Ravindranath Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలని బాగా ఆలోచించిన వ్యక్తి సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. అసెంబ్లీ మూడో రోజు సోమవారం ‘విద్య, వైద్యంలో నాడు–నేడు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్‌ మాత్రమే ట్రెండ్‌ సెట్టర్లని చెప్పారు. చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చినా 14 ఏళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని అన్నారు. ప్రజలు వలస వెళ్లకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని పిల్లలు బాగా చదువుకోవాలని సీఎం జగన్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top