మీరు చదవండి.. మీ చదువులకు నేనే పూచీ: సీఎం జగన్‌

CM Jagan Madanapalle Tour Live Updates: To Release Jagananna Vidya Deevena Scheme Funds - Sakshi

►కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారు.

ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్‌ చెప్పారు. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పేదలకు చదువును హక్కుగా మార్చాం. 

చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్‌ అన్నారు. 

సుదీర్ఘ ప్రసంగం అనంతరం సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తోంది.

►విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాం అని చెప్పారు. 

11:35AM
అన్నమయ్య జిల్లా 
►సీఎం కాన్వాయ్ కి ఎదురొచ్చిన అంబులెన్స్ 


►బస్సుని పక్కన ఆపించి  అంబులెన్సుకు దారిచ్చిన సీఎం వైఎస్ జగన్ 
►సీఎం మానవత్వానికి చేతులెత్తి నమస్కరించిన పేషంట్‌ బంధువు

11:30AM
►మదనపల్లె సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌
►సీఎంతో పాటు హెలికాఫ్టర్‌లో వచ్చిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున

11:15AM
►హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ సభా వేదిక వద్దకు బయలు దేరిన సీఎం 
►బెంగళూరు రోడ్డు, గాంధీపురం జంక్షన్, సొసైటీకాలనీ గేటు, అనిబిసెంట్ సర్కిల్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, యన్టీఆర్ సర్కిల్, భాగ్యలక్ష్మీ మిల్, ప్రశాంత్ నగర్, రెడ్డీస్ కాలనీ, కదిరి రోడ్డు మీదుగా టిప్పు సుల్తాన్ గ్రౌండ్ వరకు సాగనున్న కాన్వాయ్ 
►సీఎంను చూసేందుకు రహదారి వెంబడి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు ,అభిమానులు 
►రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన ప్రజలకు చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్‌

11:01AM
అన్నమయ్య జిల్లా 
►మదనపల్లి బీటీ కాలేజ్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్ 
►ఘనస్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ,మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, ద్వారకానాద్ రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఆకేపాటి అమర్నాథ రెడ్డి, శ్రీనివాసులు ,కలెక్టర్ గిరీషా ,డీఐజీ సెంథిల్ కుమార్ ,ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,కార్పొరేషన్ ఛైర్మెన్లు

10:35 AM
అన్నమయ్య జిల్లా
►మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానం సభా ప్రాంగణంలో కిక్కిరిసిన  విద్యార్థిని, విద్యార్థులు 
►సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిని, విద్యార్ధులు

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

10:30AM
►తిరుపతి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మదనపల్లి బయలుదేరిన సీఎం జగన్‌

10:25AM
తిరుపతి జిల్లా
►తిరుపతి విమానాశ్రయంకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 
►సీఎంను  విమానాశ్రయం వద్ద కలిసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెస్ బాబు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు

09:00 AM
తాడేపల్లి: మదనపల్లె బయలుదేరిన సీఎం జగన్‌
►మరికొద్దిసేపటిలో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది.

ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తోంది. తల్లిదండ్రులపై భారం పడకుండా  కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్‌ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. 

గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు..
గత ప్రభుత్వం హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి.

ఇలా గత ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది.

ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం.

ఎప్పటి నిధులు అప్పుడే జమ..
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.

పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top