అనంతపురం అర్బన్: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డీఆర్‌ఓ మలోలకు ప్రజాబలం సంఘం నాయకులు విన్నవించారు. డీఆర్‌ఓని శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌గఫూర్, ఇతర నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గార్లదిన్నె మండలం పెనకచర్లలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అక్కడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూమి పంపిణీ చేయాలన్నారు. ఆక్రమణదారులపై చట్టరపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మేఘన, వీరతేజ, మహబూబ్‌బాషా, పవన్, పాల్గొన్నారు.


