తాడిమర్రి:మండలంలోని చిత్రావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కృష్ణవేణి శుక్రవారం తెలిపారు. దాడితోట, నాయనపల్లి పరిధిలోని చిత్రావతి నది నుంచి ఇసుక తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులకు అప్పగించగా, ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేలు జరి మానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
15 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
రొద్దం: పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 ట్రాక్టర్లను పరిగి ఇన్‌చార్జ్ ఎస్‌ఐ రవికుమార్ శుక్రవారం తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. పెద్దమంతూరు, పి.రొప్పాల గ్రామాలకు చెందిన 15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.


