విడపనకల్లు: మండలంలోని పాల్తూరులో ఇరువర్గాల ఘర్షణలో శుక్రవారం 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. పాల్తూరుకు చెందిన సునీల్, మహేశ్, నాగలక్ష్మి, పెన్నయ్య, రవి, వన్నూరుస్వామి, ముత్తక్క కలిసి చీకలగురికికి చెందిన గంగమ్మ, రాజు, సుంకమ్మ,చంద్ర ఘర్షణపడ్డారు. ఈదాడిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పాల్తూరు పోలీసులు విచారణ చేపట్టారు.
21న ప్రతిభా పురస్కారాలు
అనంతపురం: పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఈ నెల 21న లలిత కళాపరిషత్‌లో ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 580 మార్కులపైగా సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రం, ఇంగ్లిష్ డిక్షనరీ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17లోపు సెల్: 9502097181లో వివరాలు తెలియజేయాలని కోరారు.
మెడికల్ అండ్ హెల్త్ ఆర్డీగా గీతాబాయి
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) రీజినల్ డైరెక్టర్‌గా డాక్టర్ గీతాబాయి నియమితులయ్యారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడికి రానున్నారు. ఇక్కడ పని చేస్తున్న రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో డాక్టర్ గీతాబాయి రానున్నారు.


