నేనున్నా.. | - | Sakshi
Sakshi News home page

నేనున్నా..

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

ధైర్యంగా ఉండండి..
‘మీ వెంటే ఉంటా.. న్యాయం జరిగేలా చూస్తా’

సాక్షి, విశాఖపట్నం: ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను, వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా రామ్‌నగర్‌లోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులవద్దకు వెళ్లి వారి చేతులు పట్టుకుని మాట్లాడిన జగన్‌. ‘నేనున్నాను.. అధైర్యపడొద్దు’ అంటూ భరోసా కల్పించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదనను ఓపికగా విన్న ఆయన, ఈ కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇంటి పెద్ద దిక్కు ఆసుపత్రిపాలవడంతో కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై బాధితులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్న జగన్‌, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని, ప్రాణాలను కాపాడటమే మొదటి ప్రాధాన్యంగా చూడాలని సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తామని తెలిపారు.

పరిహారం అందేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి

ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. ఆ పరిహారం లభించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఒకవేళ పరిహారం అందించకపోతే, భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగార బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని జగన్‌ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, విశాఖ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు, ధర్మాన కృష్ణదాస్‌, పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు అమర్‌నాథ్‌, పేర్ని నాని, బాలరాజు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, తలశిల రఘురాం, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్‌, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, చిన్న శ్రీను, బొడ్డేటి ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌ కుమార్‌, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌ కుమార్‌, చింతలపూడి వెంకట రామయ్య, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర, సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్‌, చింతాడ రవికుమార్‌, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్లమెంట్‌ పరిశీలకులు కదిరి బాబూరావు, శోభా హైమావతి, రెడ్డి శాంతి, విశ్వసరాయి కళావతి, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పార్టీ జిల్లా కార్యాలయం పర్యవేక్షుకుడు రవి రెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు గొలగానిహరి వెంకట కుమారి, జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌, రొంగలి జగన్నాథం, ఐహెచ్‌ ఫారూఖీ, పీలా వెంకటలక్ష్మి, నియోకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పేడాడ రమణికుమారి, శరగడం చిన అప్పలనాయుడు, వీసం రామకృష్ణ, సతీష్‌ వర్మ, జహీర్‌ అహ్మద్‌, గండి రవికుమార్‌, కొండా రాజీవ్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ భరోసా చికిత్స పొందుతున్న కార్మికులు, కుటుంబాలకు పరామర్శ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచన రూ. కోటి పరిహారం ఇచ్చే వరకు పోరాడతాం అప్పటికీ పరిహారం అందకపోతే వచ్చే మన ప్రభుత్వంలో నెల రోజుల్లోనే సాయం అందిస్తా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement