ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | ramadan on monday; ys jagan greetings to muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Jun 25 2017 9:17 PM | Updated on Jul 25 2018 4:42 PM

ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు - Sakshi

ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్‌ సోమవారం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌: ముస్లింలు పవిత్ర రంజాన్‌ సోమవారం జరుపుకోనున్నారు. సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సమరస్యానికి, సుహృద్భావానికి, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని జగన్‌ ఆకాంక్షించారు.

ఆదివారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కనిపించడంతో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను సోమవారం జరుపుకోవాలని మత పెద్దలు నిర్ణయించారు. దీంతో నెలరోజులుగా పాటిస్తోన్న ఉపవాస దీక్షలకు ముస్లింలు ముగింపు పలికారు. రేపే రంజాన్‌ కావడంతో హైదరాబాద్‌ సహా అన్ని పట్టణాల్లో సందడి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement