
రేసింగ్ రాయుళ్ల ఆటకట్టు
పలుమార్లు జరిమానాలు, కౌన్సిలింగ్ లు నిర్వహించినా ఫలితం కనిపించడంలేదు.
హైదరాబాద్ : పలుమార్లు జరిమానాలు, కౌన్సిలింగ్ లు నిర్వహించినా బైక్ రేసర్లలో ఫలితం కనిపించడంలేదు. గత వారం నెక్లెస్ రోడ్ లో రేసింగ్ లకు పాల్పడుతున్న 80 మంది పోలీసులు పట్టుబడ్డారు. అయినా తీరు మారని యువకులు బైక్ పోటీలు పెట్టుకుంటున్నారు. తాజాగా శుక్రవారం అర్థరాత్రి చక్కర్లు కొడుతున్న రేసింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగరంలోని బంజారాహిల్స్ రోడ్లపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక రేసింగ్‌లకు పాల్పడుతున్న 30 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ లు సీజ్ చేశారు. కాగా.. వీరిలో మైనర్‌లు కూడా ఉన్నట్టు సమాచారం. రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు.