హరితహారం ఉద్యమంలా చేపట్టాలి | Karimnagar to Raise 6.24 Cr Plants Under Haritha Haram | Sakshi
Sakshi News home page

హరితహారం ఉద్యమంలా చేపట్టాలి

Jan 7 2015 4:43 AM | Updated on Sep 2 2017 7:19 PM

హరితహారం ఉద్యమంలా చేపట్టాలి

హరితహారం ఉద్యమంలా చేపట్టాలి

తెలంగాణ హరిత హారం’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని హరిత హారం రాష్ట్ర ప్రత్యేక అధికారి ప్రియంక వర్గీస్ అన్నారు.

 ప్రగతినగర్ : ‘తెలంగాణ హరిత హారం’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని  హరిత హారం రాష్ట్ర ప్రత్యేక అధికారి ప్రియంక వర్గీస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. జిలా ్లలో హరితహారం కింద తీసుకుంటున్న చర్యలను, ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో, ప్రజా ప్రతినిధులలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో,ఆసుపత్రులు ఆవరణలో పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటించినట్లయితే రోగులకు సగం జబ్బులు నివారించినట్లవుతుందన్నారు.అన్ని పీహెచ్‌సీలను ఆదర్శవంతమైన పీహెచ్‌సీలుగా రూపొందించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. పాఠశాలలు, కళాశాలలో, వసతిగృహాలలో మొక్కలు నాటించాలన్నారు.
 
 మహిళా సంఘాలు టేకు మొక్కలు పెంచడానికి అవసరమైన చర్యలు డీఆర్‌డీఏ ద్వారా చేపట్టాలన్నారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రోజు వారీగా  మొక్కల పెంపకాల వెబ్‌సైట్ ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఎప్పటికప్పుడు నిర్దేశించిన సాప్ట్‌వేర్‌లో సమాచారాన్ని  పొందుపర్చాలన్నారు.అన్నిగ్రామాల సర్పంచులకు సమావేశాలు ఏర్పటు చేసి తెలంగాణ హరితహారం గురించి పెంచాల్సిన మొక్కల గురించి తెలియచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కల పెంపకానికి సంబంధించి మొక్కల పేర్లు నాటిన తేదిలలో బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఫారెస్ట్ అడీషన్‌ల్ ప్రిన్సిపాల్ వైబాబురావు,డీఎంహెచ్‌ఓ బసవేశ్వర్‌రావు,డీఈఓ శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement