దుర్భర జీవితం ఇప్పుడే కనపడిందా? | Kanapadinda poor life now? | Sakshi
Sakshi News home page

దుర్భర జీవితం ఇప్పుడే కనపడిందా?

Jan 20 2015 3:36 AM | Updated on Aug 11 2018 7:03 PM

దుర్భర జీవితం ఇప్పుడే కనపడిందా? - Sakshi

దుర్భర జీవితం ఇప్పుడే కనపడిందా?

మహబూబ్‌నగర్ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని సీఎం కేసీఆర్‌కు ఇప్పుడే తెలిసిందా. ఐదేళ్లుగా పాలమూరు ఎంపీగా పనిచేసిన కాలంలో కనిపించలేదా....

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని సీఎం కేసీఆర్‌కు ఇప్పుడే తెలిసిందా. ఐదేళ్లుగా పాలమూరు ఎంపీగా పనిచేసిన కాలంలో కనిపించలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాగనూరు మండలం కృష్ణా గ్రామంలో సోమవారం పార్టీ నిర్వహించిన తెలంగాణ బీజేపీ పోరుయాత్ర దినోత్సవ సభలో ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సమగ్ర కుటుంబ స ర్వే, మన వూరు మన ప్రణాళిక వివరా లు ఏమయ్యాయి. కొత్తగా మళ్లీ సర్వే లు ఎందుక ంటూ ప్రశ్నించారు.

సాగునీటి ప్రాజెక్టుల పూర్తిచేసే విషయంలో రా ష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై తమకు నమ్మ కం లేదన్నారు. తెలంగాణ సాధన కో సం పోరాడిన రీతిలో రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ 1969 నుంచి ఉద్యమాలతో చైతన్యవంతులైన తెలంగాణవాసులు అభివృద్ధి కోరుకుంటున్నారని అన్నా రు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ జి ల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమై సమీక్షంచకపోవడాన్ని ప్రశ్నించారు. జి ల్లాలో కరువు బారిన పడిన మండలాలై పె ప్రకటన చేయాలని డిమాండు చేశా రు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పేరి ట వేల కోట్ల రూపాయలకు టీఆర్‌ఎస్ ఎసరు పెడుతోందన్నారు. మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఒత్తిడితోనే జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు మంజూరయ్యాయని అన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు మా ట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడు తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకు న్నా ప్రజలకు అండగా ఉంటుందన్నా రు. చింతా సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తూట్లు పొడుస్తోందని, కేసీఆర్ దళితద్రోహిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పార్టీ నాయకులు కొండయ్య, మాజీ డీజీపీ, బీజేపీ మేధావుల విభాగం ఛైర్మన్ దినేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు అమర కుమార్ తదితరులు ప్రసంగించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాములు, శ్రీవర్దన్‌రెడ్డి, రజనీరెడ్డి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
 
కృష్ణాలో భారీ ర్యాలీ
పోరుయాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణానది ఒడ్డున నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కృష్ణా గ్రామం నుంచి సమావేశ ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి ఎడ్లబండిపై ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది వాహనాలు ర్యాలీని అనుసరించాయి. కృష్ణానదికి హారతి ఇవ్వడంతో పాటు కృష్ణమ్మ తల్లి విగ్రహానికి కిషన్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. అమరువీరుల ఆత్మశాంతి కోరుతూ నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అనంతరం మూడేళ్ల క్రితం చేపట్టిన పోరుయాత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement