రైలు కిందపడి 30 గొర్రెలు మృతి | 30 sheeps killed in nizamabad due to cross railway track | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి 30 గొర్రెలు మృతి

Aug 5 2015 12:00 PM | Updated on Sep 3 2017 6:50 AM

ప్రమాదవశాత్తూ రైలు కింద పడి 30 గొర్రెలు మృతి చెందాయి.

నిజామాబాద్ :  ప్రమాదవశాత్తూ రైలు కింద పడి 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిడ్డ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఓ గొర్రె రైలు పట్టాలు దాటడంతో మిగతా గొర్రెలు కూడా రైలు వచ్చే సమయంలో రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గొర్రెల యజమాని బండారు వీరయ్య తెలిపారు. గొర్రెల మృతితో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement