అయ్యో.. పన్నీర్‌ సెల్వం! | Sakshi
Sakshi News home page

అయ్యో.. పన్నీర్‌ సెల్వం!

Published Thu, Feb 16 2017 8:07 PM

అయ్యో.. పన్నీర్‌ సెల్వం!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన పన్నీర్‌ సెల్వంకు అధికార లాంఛనాలు దూరమవుతున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెల్వం కారుకు ఉన్న ఎర్ర బుగ్గను అధికారులు తొలగించారు. పన్నీర్‌ సెల్వం నివాసం వద్ద భద్రతను పోలీసులు తగ్గించారు. సోమవారం ఆయన ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేయనున్నారు.

ఈ నెల 5న పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) రోజు శశికళపై తిరుగుబాటు చేశారు. గవర్నర్‌ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడంతో దాదాపు రోజుల పాటు సంక్షోభం కొనసాగింది. సీఎం కుర్చీ చివరకు శశికళ, పన్నీర్ సెల్వం దక్కలేదు. అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఈ నెల 18న శాసనసభలో పళనిస్వామి బలం నిరూపించుకోనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement