ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌లో పేలుడు: ముగ్గురికి గాయాలు | Cylinder blast on Naval ship INS Nireekshak, 3 sailors injured | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌లో పేలుడు: ముగ్గురికి గాయాలు

Apr 20 2016 1:49 PM | Updated on Sep 3 2017 10:21 PM

ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌లో పేలుడు: ముగ్గురికి గాయాలు

ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌లో పేలుడు: ముగ్గురికి గాయాలు

భారత నేవీకి చెందిన డైవింగ్‌ సపోర్ట్‌ నౌక ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌లో చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురికి గాయాలయ్యాయి.

త్రివేండ్రం:
భారత నేవీకి చెందిన డైవింగ్‌ సపోర్ట్‌ నౌక ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌లో చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆక్సిజన్‌  సిలిండర్‌ ఛార్జింగ్‌ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నౌక విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్తుండగా త్రివేండ్రం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 16న నౌకలో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో ఒక డైవర్‌, ఇద్దరు నావికులు గాయపడినట్లు కెప్టెన్ శర్మ బుధవారం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement