ఎక్కువ మార్కులొచ్చాయని విషమిచ్చింది | Co-student mixed Mosquito repellent in the bottle of water | Sakshi
Sakshi News home page

ఎక్కువ మార్కులొచ్చాయని విషమిచ్చింది

Aug 24 2017 1:25 AM | Updated on Oct 8 2018 3:17 PM

పరీక్షలో తనకన్నా ఎక్కువ మార్కులు పొందిన సహ విద్యార్థిని నీళ్ల సీసాలో మరో బాలిక దోమల నివారణ మందు కలిపి విషతుల్యం చేసింది.

వాటర్‌ బాటిల్‌లో దోమల నివారణ మందు కలిపి..
 
సత్నా(ఎంపీ): పరీక్షలో తనకన్నా ఎక్కువ మార్కులు పొందిన సహ విద్యార్థిని నీళ్ల సీసాలో మరో బాలిక దోమల నివారణ మందు కలిపి విషతుల్యం చేసింది. పోలీస్‌ కేసుకు భయపడి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉండగా, నిందితురాలి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం...మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన ఇద్దరు బాలికలు స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. సోమవారం పాఠశాలలో నిందితురాలు దోమల నివారణ మందు కలిపిన నీటిని తాగిన తరువాత బాధితురాలు అస్వస్థతకు లోనైంది.

ఈ సంగతిని పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిందిత బాలిక వాటర్‌ బాటిల్‌ను విషతుల్యం చేసి, దోమల నివారణ మందుని మరొకరి బ్యాగులో పెట్ట డం సీసీటీవీ కెమెరాలో కనిపించింది. ఆమె కన్నా తాను ఎక్కువ మార్కులు పొందినందుకు అసూయతోనే ఇలా చేసి ఉండొచ్చని బాధితురాలు పేర్కొంది. మరోవైపు నిందితురాలు కూడా మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement