దేశీ కంపెనీకే ఎయిర్‌ ఇండియా | Aviation Minister Says Want An Indian Company To Acquire Air India | Sakshi
Sakshi News home page

దేశీ కంపెనీకే ఎయిర్‌ ఇండియా

Dec 31 2019 2:36 PM | Updated on Dec 31 2019 2:40 PM

 Aviation Minister Says Want An Indian Company To Acquire Air India   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత కంపెనీకే ఎయిర్‌ ఇండియాను విక్రయించాలని యోచిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి స్పష్టం చేశారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణను సత్వరమే చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకువెళుతున్నామని అన్నారు. ఎయిర్‌ ఇండియా విక్రయానికి త్వరలోనే తమ మంత్రిత్వ శాఖ ఆయా సంస్ధల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తుందని చెప్పారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు సన్నాహాలు చేపడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రభుత్వ రంగ ఎయిర్‌లైన్‌ ఎయిర్‌ ఇండియా ఇప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతోందని, రోజుకు సగటున రూ 26 కోట్ల నష్టం వాటిల్లుతోందని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement