మీటూ : ‘ఖల్‌నాయక్‌’ దర్శకునిపై ఆరోపణలు

A Woman Has Accused Subhash Ghai Of Drugging And Raping Her - Sakshi

భారత్‌లో కూడా మీటూ మూవ్‌మెంట్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపులు గురించి బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బాలీవుడ్‌ ప్రముఖులు, మీడియా రంగం పెద్దలు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరి కోవలోకి మరో ప్రముఖ దర్శకుడు చేరాడు. ‘ఖల్‌నాయక్‌’, ‘రామ్‌ లఖాన్‌’, ‘పర్దేస్‌’ వంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు సుభాష్‌ ఘయ్‌ ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలే ఎదర్కొంటున్నారు.

తన వివరాలు వెల్లడించని ఓ మహిళ సుభాష్‌ ఘయ్‌ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. స్క్రిప్ట్‌ డిస్కషన్‌ కోసమని సుభాష్‌ నన్ను తన ఆఫీస్‌కు పిలిచేవాడని ఆ సమయంలో తనతో తప్పుగా ప్రవర్తించేవాడని తెలిపారు. ఒక రోజు కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు.. కలిపి ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. అంతేకాక ఈ విషయం గురించి బయటకు చెబితే తనకు వచ్చే జీతం డబ్బులు కూడా ఇవ్వనని బెదిరించాడని వెల్లడించారు. ఆ సమయంలో తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ జాబ్‌ తనకు ఎంతో అవసరం ఉండటం వల్ల తాను ఈ దారుణం గురించి బయటకు వెల్లడించలేదని పేర్కొన్నారు.

అయితే సదరు మహిళ చేసిన ఆరోపణలను సుభాష్‌ ఖండించారు. తాను ఎవరి వేధింపులకు గురి చేయలేదని తెలిపారు. ఒకవేళ ఆ మహిళ చేసిన ఆరోపణలు వాస్తవమే అయితే ఆమె కోర్టుకు వెళ్లి వాటిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తానే ఆమె మీద పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉ‍న్న వ్యక్తుల గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందని సుభాష్‌ ఘయ్‌ ఆరోపించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top