స్పెయిన్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు | Spanish election: PP wins most seats but deadlock remains | Sakshi
Sakshi News home page

స్పెయిన్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు

Jun 28 2016 12:36 PM | Updated on Sep 4 2017 3:38 AM

స్పెయిన్ పునఃఎన్నికల్లో అధికార పాపులర్ పార్టీ(పీపీ) విజయం సాధించింది.

మాడ్రిడ్: స్పెయిన్ పునఃఎన్నికల్లో అధికార పాపులర్ పార్టీ(పీపీ) విజయం సాధించింది. అయితే.. సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో.. తాత్కాలిక ప్రధాని మారియానో రజోయ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన మద్దతును కూడగట్టగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. 350 సీట్ల పార్లమెంటుకు డిసెంబర్‌లో ఎన్నికలు జరిగినప్పుడూ పీపీ అత్యధిక సీట్లు గెల్చినా మెజారిటీకి దూరంగా ఆగిపోయింది.

ఇతర పార్టీలూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారంనాటి ఎన్నికల్లో పీపీ 137 సీట్లను గెలుచుకుంది. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ (కనీసం 176 సీట్లు) సాధించలేకపోయింది. సోషలిస్ట్ పార్టీ 85 సీట్లతో రెండో స్థానంలో ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement