
గర్భంతో ఉంటే నో కూల్‌డ్రింక్స్!
గర్భంతో ఉన్నప్పుడు చక్కెర ఎక్కువగా ఉన్న కూల్‌డ్రింక్స్ తాగితే పుట్టే పిల్లలకు భవిష్యత్తులో ఊబకాయం వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు అంటున్నారు.
వీరి పిల్లలు ప్రాథమిక పాఠశాలలో ఉండగా వారి బరువులను పరిశీలించగా దాదాపు 25 శాతం మంది అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గర్భిణులుగా ఉన్నపుడు వీరు రోజుకు రెండు సార్లు కూల్‌డ్రింక్స్ తాగినట్లు గుర్తించారు. అయితే ఈ రెండింటికీ ప్రత్యక్ష సంబంధం ఉందా? లేదా? అన్నది స్పష్టం కాకపోయినా గర్భం దాల్చినపుడు కూల్‌డ్రింక్స్‌ను తగ్గించడం మేలని, వీలైనంత ఎక్కువగా నీరు తీసుకోవాలని రిఫాస్ సూచిస్తున్నారు.