బస్సు ప్రమాదంలో 23 మంది మృతి | 23 killed in Haiti bus crash | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంలో 23 మంది మృతి

Oct 11 2014 1:27 PM | Updated on Sep 2 2017 2:41 PM

బస్సు ప్రమాదంలో 23 మంది మృతి

బస్సు ప్రమాదంలో 23 మంది మృతి

హైతీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి లోయలో పడి పోయింది.

పోర్ట్ - ఏ- ప్రిన్స్ : హైతీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు.  ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుంచి 18 మృతదేహలను వెలికి తీసినట్లు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారని చెప్పారు. బస్సు బ్రేకులు ఫేయిలు కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement