'బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టింది' | telangana formation day celebrations in telangana bjp state office | Sakshi
Sakshi News home page

'బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టింది'

Jun 2 2016 11:05 AM | Updated on Aug 11 2018 7:03 PM

తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తెలిపారు. గురువారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా.కె.లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... బీజేపీ ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్లమెంట్లో, బయట పోరాటం చేసింది బీజేపీ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకున్న ఫలాలు కింది స్థాయికి వెళ్లే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. సెప్టెంబర్ 17ను కూడా ప్రభుత్వమే అధికారికంగా జరపాలని డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement