చేప ప్రసాదానికి పోటెత్తిన ప్రజలు | chepa prasadam distribution in nampally | Sakshi
Sakshi News home page

చేప ప్రసాదానికి పోటెత్తిన ప్రజలు

Jun 8 2017 11:57 AM | Updated on Sep 5 2017 1:07 PM

ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో గురువారం ప్రారంభమైంది.

హైదరాబాద్‌: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో గురువారం ప్రారంభమైంది. చేప ప్రసాదం స్వీకరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి గాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 32 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంత్‌ నిరంకారి, ఎన్‌సీసీ వాలంటీర్లు నిర్వాహకులకు సహకరించారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి పలు స్వచ్ఛంద సంస్థలు టిఫిన్‌, భోజన ఏర్పాట్లు చేశాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement