షుగర్ వ్యాధి ప్రాణాలను అతి సున్నితంగా హరిస్తుంది | diabetes disease slowly kills us | Sakshi
Sakshi News home page

షుగర్ వ్యాధి ప్రాణాలను అతి సున్నితంగా హరిస్తుంది

Nov 13 2013 11:57 PM | Updated on Sep 2 2017 12:34 AM

నవీన యుగంలో వయస్సు, లింగ-విచక్షణ లేకుండా రాను రాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది.

నవీన యుగంలో వయస్సు, లింగ-విచక్షణ లేకుండా రాను రాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. భవిష్యత్తులో ప్రతి ఇద్దరిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మన శరీరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకునేలోపే మనలోని షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఎన్నో అనారోగ్యాల బారిన పడతాం. కాబట్టి ప్రతి ఒక్కరికీ డయాబెటిస్‌పై అవగాహన ఎంతో ముఖ్యం.
 
 లక్షణాలు
 అతిగా మూత్రవిసర్జన, ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా దాహం వేయడం, మందగించిన చూపు. కారణం లేకుండా బరువు తగ్గడం, బద్దకం, బరువు తగ్గడం తప్ప మిగతా లక్షణాలన్నీ డయాబెటిస్ - 2 లో కూడా కనిపిస్తాయి.
 
 కారణాలు: స్థూలకాయం. వంశపారంపర్యం, మాసనసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, థైరాయిడ్, పీసీఓడీ ఉన్నవాళ్ళకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
 రకాలు: టైప్ - 1 డయాబెటిస్: సాధారణంగా బీటా కణాలను మన శరీరమే స్వయంగా నాశనం చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండదు. అందుకే ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇస్తారు. టైప్ - 2  డయాబెటిస్: ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్(ఇన్సులిన్ నిరోధకత) ఉంటుంది.
 
 రెసిస్టెన్షియల్ డయాబెటిస్ : ఈ రకాన్ని గర్భధారణ సమయంలో మాత్రమే చూస్తాం. సాధారణంగా కాన్పు తర్వాత, సాధారణ స్థితికి వస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలానే కొనసాగుతుంది.
 
 డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్లు: నాడీ కణాల మీద ప్రభావం ఏర్పడుతుంది. ఇందులో మొత్తం శరీరభాగాలన్నీ ప్రభావితమవుతాయి. మొత్తం న్యూరైటిస్‌లలో ఇది అత్యంత ప్రభావశీలి. నరం మీద మైలిన్ షీత్ (పొర) దెబ్బ తినడం వల్ల తిమ్మిర్లు మరియు మంటగా అనిపించడం, స్పర్శ తెలియకపోవడం, అంటే వారి కాలికి, చేతికి ఏదైనా గుచ్చుకున్నా దెబ్బ తగిలినా రోగికి తెలియదు. నడకలో మార్పు, కంటిచూపు తగ్గిపోవడం, కొన్నిసార్లు మూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వంటి సమస్యలు చూస్తూ ఉంటాము.
 
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారనియమాలు: రోజు కనీసం 45 ని॥పాటు నడక లేదా వ్యాయామం
 
 =భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి  
 
 =రాత్రిపూట ఫలహారం మాత్రమే (టిఫిన్) తీసుకోవాలి. (అన్నం తినకూడదు)
 
 =ప్రతిరోజు ఒక నిర్ణీత సమసయంలోనే భోజనం చేయాలి
 
 =పాదాల మీద పుండ్లు, ఆనెలు, గాయాలు ఏమైనా ఉన్నా డాక్టర్ సమక్షంలోనే చికిత్స తీసుకోవాలి
 
 =పిండిపదార్థాలు తగ్గించి అధిక పీచు ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
 మానుకోవాల్సిన అలవాట్లు: పొగత్రాగకూడదు
 
 =మద్యం సేవించకూడదు  
 
 =పాదరక్షలు లేకుండా నడవకూడదు
 
 =మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
 
 =కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మాంసం తగ్గించి తీసుకోవాలి.
 
 పాజిటివ్ హోమియోపతి వైద్య విధానం కేవలం వ్యాధి లక్షణాలు మాత్రమే కాక మానవుని మొత్తంగా పరిగణనలోనికి తీసుకొని, వ్యాధి లక్షణాల ఉపశమనం కాకుండా వ్యాధి పూర్తిగా నయం కావాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. హోమియోపతి వైద్యవిధానంలో మానవుని కాన్‌స్టిట్యూషన్‌కు ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది. అంటే అతని వ్యాధి లక్షణాలు, పేథాలజీ, కుటుంబ చరిత్ర, మానసిక లక్షణాలు తదితర అన్ని విషయాలు పరిగణనలోనికి తీసుకుని చికిత్స చేయడం వలన కేవలం ఉపశమనం మాత్రమే కాకుండా పూర్తిగా నయం చేయవచ్చును. దేశ వ్యాప్తంగా పలు శాఖలతో విస్తరించి, ప్రతిదినం హోమియో వైద్య విధానంలో నూతన ఒరవడులను అందిపుచ్చుకుంటూ, రీసెర్చ్ విభాగంలో అందరికంటే ఉన్నతంగా నిలుస్తూ, హోమియో వైద్య ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది.
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి

 
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivehomeopathy.com

 

Advertisement
 
Advertisement
Advertisement