ఎంజీఎం ల్యాబ్‌కు నిలిచిన విద్యుత్‌ | stoped electricitity for lab | Sakshi
Sakshi News home page

ఎంజీఎం ల్యాబ్‌కు నిలిచిన విద్యుత్‌

Sep 4 2016 12:50 AM | Updated on Sep 4 2017 12:09 PM

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని కరెంట్‌ సమస్య వేధిస్తోంది. ఓపీ సమయం ఉదయం 9 నుంచి 12 గంటల సమయంలో విద్యుత్‌ నిలిచిపోతే రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది.

  • రోగుల నరకయాతన
  • ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని కరెంట్‌ సమస్య వేధిస్తోంది. ఓపీ సమయం ఉదయం 9 నుంచి 12 గంటల సమయంలో విద్యుత్‌ నిలిచిపోతే రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది. ఆస్పత్రికి ఓపీ సమయంలో వివిధ విభాగాల్లో వైద్యచికిత్సలు పొందేందుకు వందల సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్యపరీక్షల నిమిత్తం పలు రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. శనివారం ఉదయం 10 గం టల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో పలు వార్డుల్లోని రోగులతోపా టు ఓపీలోని వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోగులకు రక్త పరీక్షలు నివేదికలు అందకపోవడంతో ఉన్న రోగంతోనే తిరు గు పయనమయ్యారు. దీనికి తోడు ఆది, సోమవారాలు సెలవు కావడంతో రోగులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పరుగులు తీయాల్సి వచ్చింది. అయితే ఆస్పత్రిలో విద్యుత్‌ కోత సమయాల్లో అత్యవసర వార్డులకు కల్పిస్తున్న జనరేటర్‌ సౌకర్యాన్ని ల్యాబ్‌లు సైతం కల్పిస్తే రోగులకు సేవలు మెరుగుపడుతాయని వైద్యులే పేర్కొంటున్నారు. ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపై భారం ఎక్కువ పడడంతో సాంకేతిక సమస్య తెలెత్తి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement