మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల కోసం సాగిస్తున్న ఉద్యమంలో నిజాయితీ ఉందని మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నా రు. ఆయన రాజమహేంద్రవరం నుంచి ఆదివారం సాయంత్రం కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. ఆయనకు ముద్రగడ సాదరంగా స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ ముద్రగడతో తనకు చిరకాల స్నేహబంధం
-
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కితాబు
-
కిర్లంపూడిలో స్నేహపూర్వక భేటీ
జగ్గంపేట :
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల కోసం సాగిస్తున్న ఉద్యమంలో నిజాయితీ ఉందని మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నా రు. ఆయన రాజమహేంద్రవరం నుంచి ఆదివారం సాయంత్రం కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. ఆయనకు ముద్రగడ సాదరంగా స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ ముద్రగడతో తనకు చిరకాల స్నేహబంధం ఉందన్నారు. తన ఆరోగ్యం బాగోకపోయినా ప్రాణస్నేహితుడైన ముద్రగడను కలిసేందుకే వచ్చానన్నారు. ఉద్యమనేతగా పేరొందిన ముద్రగడకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని దీవించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో ముద్రగడ ఉద్యమం చేసినప్పుడు ప్రభుత్వపరంగా అప్పట్లో జీవో తానే ఇచ్చానన్నారు. ముద్రగడ తన భార్య పద్మావతి, కోడలు సిరి, కుమారుడు గిరి, పెద్దకుమారుడు బాలు, వియ్యంకుడు నరిసే సోమేశ్వరరావులను, కాపు ఉద్యమ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్, గోపు చంటిబాబు, గణేశుల రాంబాబు, తోట రాజీవ్, తోట బాబు, మలకల చంటిబాబు, గోకాడ సత్యనారాయణమూర్తి, సందీప్, గౌతు స్వామి, నరిసే సోమేశ్వరరావు, పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మ¯ŒS వర్దినీడి సుజాత, రాచమళ్ళ వెంకటేశ్వరరావు, అన్నెం శేషు తదితరులను రోశయ్యకు పరిచయం చేశారు. ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం తదితర నియోజకవర్గాలకు చెందిన అనుయాయులు ముద్రగడ ఇంటికి భారీగా తరలివచ్చారు. రోశయ్య వెంట ఏపీ ఐఐసీ మాజీ చైర్మ¯ŒS శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.