breaking news
rosayya
-
రేపు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య రాక
కాకినాడ సిటీ : తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సోమవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి సోమవారం ఉదయం 7.30 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక సరోవర్ పోర్టికోలో బస చేస్తారు. అనంతరం 11 గంటలకు కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఉండూరు సెంటర్లో జువెల్ సిటీ ఫేజ్–2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి హైదరాబాద్ వెళతారు. -
ముద్రగడ ఉద్యమంలో నిజాయితీ
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కితాబు కిర్లంపూడిలో స్నేహపూర్వక భేటీ జగ్గంపేట : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల కోసం సాగిస్తున్న ఉద్యమంలో నిజాయితీ ఉందని మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నా రు. ఆయన రాజమహేంద్రవరం నుంచి ఆదివారం సాయంత్రం కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. ఆయనకు ముద్రగడ సాదరంగా స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ ముద్రగడతో తనకు చిరకాల స్నేహబంధం ఉందన్నారు. తన ఆరోగ్యం బాగోకపోయినా ప్రాణస్నేహితుడైన ముద్రగడను కలిసేందుకే వచ్చానన్నారు. ఉద్యమనేతగా పేరొందిన ముద్రగడకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని దీవించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో ముద్రగడ ఉద్యమం చేసినప్పుడు ప్రభుత్వపరంగా అప్పట్లో జీవో తానే ఇచ్చానన్నారు. ముద్రగడ తన భార్య పద్మావతి, కోడలు సిరి, కుమారుడు గిరి, పెద్దకుమారుడు బాలు, వియ్యంకుడు నరిసే సోమేశ్వరరావులను, కాపు ఉద్యమ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్, గోపు చంటిబాబు, గణేశుల రాంబాబు, తోట రాజీవ్, తోట బాబు, మలకల చంటిబాబు, గోకాడ సత్యనారాయణమూర్తి, సందీప్, గౌతు స్వామి, నరిసే సోమేశ్వరరావు, పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మ¯ŒS వర్దినీడి సుజాత, రాచమళ్ళ వెంకటేశ్వరరావు, అన్నెం శేషు తదితరులను రోశయ్యకు పరిచయం చేశారు. ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం తదితర నియోజకవర్గాలకు చెందిన అనుయాయులు ముద్రగడ ఇంటికి భారీగా తరలివచ్చారు. రోశయ్య వెంట ఏపీ ఐఐసీ మాజీ చైర్మ¯ŒS శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. -
కన్యకాపరమేశ్వరికి బంగారుచీర
పాతపోస్టాఫీసు: పాతనగరంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మూలవిరాట్‌ను బంగారు చీరతో అలంకరించనున్నారు. 138 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయంలోని మూల విరాట్‌ను సుమారు 4 కేజీల బంగారంతో తయారుచేయించిన బంగారు చీరను అలంకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల సంఘం కార్యదర్శి యలమర్తి హరనాథ్, అధ్యక్షుడు నల్లూరి నూకరాజు మాట్లాడుతూ నగరంలోని ఆర్యవైశ్య భక్తుల విరాళాల ద్వారా సేకరించిన బంగారంతో వైభవ్ జ్యూయలరీ వారి ఆధ్వర్యంలో బంగారు చీరను తయారు చేయించామని తెలిపారు. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా ఈనెల 19న అమ్మవారికి చీరను అలంకరించనున్నామని అన్నారు. నగరంలోని భక్తులు యావన్మందీ ఈ వేడుకను కనులారా తిలకించాలని కోరారు.