కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి | agri labour died in accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

Jan 12 2017 10:20 PM | Updated on Sep 28 2018 3:41 PM

కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి - Sakshi

కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

నాదెండ్ల (చిలకలూరిపేట): కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

 
 
నాదెండ్ల (చిలకలూరిపేట): కారు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. యడ్లపాడు మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన బిరుదు హనుమంతరావు (43) గణపవరం రాజీవ్‌గాంధీ సెంటర్‌లో జాతీయ రహదారిని దాటుతుండగా, వేగంగా వస్తున్న కారు ఢీకొని మృతి చెందాడు. ఎస్సై కె.చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు వ్యవసాయ కూలీ పనులు చేసుకునే హనుమంతరావు బుధవారం పనుల అనంతరం తన అన్న కొడుకు సురేష్‌తో కలిసి గణపవరం రాజీవ్‌«గాంధీ కాలనీకి చేరుకున్నారు. అనంతరం ఇద్దరూ తిరిగి తిమ్మాపురం వెళ్లేందుకు జాతీయరహదారిని దాటుతున్న సమయంలో గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో హనుమంతరావుకు తీవ్ర గాయాలు కావటంతో అదే కారులో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  పరీక్షల అనంతరం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గురువారం మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, 8వ తరగతి చదివే కుమార్తె కోమలి ఉన్నారు. హనుమంతరావు మృతితో ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement