అవకాశాలు లేకపోవడంతో బిరియానీ కొట్టు పెట్టుకున్నా.. | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన దర్శకుడి పశ్చాత్తాపం

Published Thu, Feb 14 2019 12:29 PM

Actor Sandhya Husband Realize in Murder Case - Sakshi

చెన్నై , పెరంబూరు: భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన సినీ దర్శకుడు బాలకృష్ణన్‌ మిత్రులతో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. వివరాలు.. సినీ సహాయనటి సంధ్య ఆమె భర్త దర్శకుడు బాలకృష్ణన్‌లది ప్రేమవివాహం. ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్ధాంగిని అనుమానంతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా హత్య చేసిన దర్శకుడు బాలకృష్ణన్‌ తమ ప్రేమ కథను ఇటీవల మిత్రులతో వెల్లబోసుకున్నాడు. ‘‘ సంధ్య, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఆ ప్రేమ సంధ్యను హత్యచేసే వరకూ తగ్గలేదు.  నేనంటే సంధ్యకు ఎంతో ప్రేమ, నన్ను నిరంతరం మరచిపోకూడదని తన శరీరంపై మూడు చోట్ల పచ్చబొట్టు పొడిపించుకుంది. వద్దని వారించినా, వినలేదు. మాకు పరమశివుడంటే భక్తి. నిత్యం ఆయన్ని ప్రార్థించేవాళ్లం. సంధ్య తన కుడి చేతిపై శివపార్వతుల రూపాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుంది. మేమూ శివపార్వతుల్లా జీవించాలని కలలు కన్నాం.

బిరియానీ కొట్టు పెట్టుకున్నా
భార్య, పిల్లల కోసం ఎంతో శ్రమించేవాడిని. సినిమా అవకాశాలు లేకపోవడంతో బిరియానీ  కొట్టు పెట్టుకున్నా. ఆ తరువాతనే సినిమాల్లో దర్శకుడిగా అవకాశం వచ్చింది. చాలా మంది కొత్త వారికి అవకాశాలు కల్పించాను. ఇటీవలే అన్ని సమస్యలు సమసిపోయి మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ ప్రయత్నాల్లో ఉండగా ఈ సంఘటన జరిగింది అని బాలకృష్ణన్‌ తన ప్రేమ కథను చెప్పాడు. ఇతను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య తల, ఇతర భాగాలు ఇంకా పోలీసులకు లభ్యం కాలేదు. అందుకోసం పోలీసులు పగలనక రాత్రనక గాలిస్తూనే ఉన్నారు.

అవయవాలు అమ్ముకున్నారేమో
సంధ్య తల్లి ప్రసన్న కుమారి, బంధువులు నాగర్‌కోవిల్‌ సమీపంలోని జ్ఞాలం గ్రామంలో నివశిస్తున్నారు. తన కూతురి హత్య సంఘటనపై ప్రసన్నకుమారి స్పందిస్తూ తన కూతురిని  కిరాతకంగా హత్య చేశారని, ఈ హత్యలో బాలకృష్టన్‌ మాత్రమే కాకుýండా మరికొందరు ఉంటారనే అనుమానం కలుగుతోందన్నారు. తన కూతురి అవయవాలు గుండె, కాలేయం వంటిని కనిపించకుండా పోవడంతో వాటిని అమ్ముకుని ఉంటారనే సందేహం కలుగుతోందన్నారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి హంతకులను శిక్షించాలని కోరారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement