బిగ్‌ బ్యాటరీతో మైక్రోమ్యాక్స్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Micromax Canvas 2 Plus Launched At Rs 8999 - Sakshi

మైక్రోమ్యాక్స్‌ తన కాన్వాస్‌ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కాన్వాస్‌ 2 ప్లస్‌(2018) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర 8,999 రూపాయలు. 5.7 అంగుళాల స్క్రీన్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది. మెయిన్‌స్ట్రీమ్‌ ఫోన్లు ఆఫర్‌ చేసే అన్ని ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్‌ అందిస్తోంది. ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌ టాప్‌ ఫీచర్‌ అతిపెద్ద 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ. దీని బ్యాటరీ లైఫ్‌ 15 నుంచి 20 గంటలు. 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ రూపొందింది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా దీనిలో ఉన్నాయి. పలుచైన బడ్జెట్‌ ఫోన్లలలో ఇదీ ఒకటి. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ 8ఎంఎం థిక్‌నెస్‌ను కలిగి ఉందని మైక్రోమ్యాక్స్‌ పేర్కొంది. జెట్‌ బ్లాక్‌ ఫిన్నిష్‌తో ఈ డివైజ్‌ అందుబాటులో ఉంది. తొలుత కాన్వాస్‌ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసినప్పుడు తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ కాన్వాస్‌ 2 అని మైక్రోమ్యాక్స్‌ సహ వ్యవస్థాపకుడు వికాస్‌ జైన్‌ చెప్పారు. ఇన్ఫినిటీ స్క్రీన్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, అతిపెద్ద బ్యాటరీతో ప్రస్తుతం కాన్వాస్‌ 2 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చామని తెలిపారు. ఒకానొక సమయంలో భారత్‌లో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీదారిగా మైక్రోమ్యాక్స్‌ ఉండగా.. కానీ గత రెండేళ్ల నుంచి కంపెనీ తన స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం మార్కెట్‌ను చైనీస్‌ కంపెనీలు నడిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ లీడర్‌గా షావోమి ఉంది. మైక్రోమ్యాక్స్‌ తాజాగా లాంచ్‌ చేసిన కాన్వాస్‌ 2 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆఫ్‌లైన్‌గా అందుబాటులో ఉండనుంది.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top